Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ది కేరళ స్టోరీ పేరుతో సినిమా తగదంటూ
కేరళలో కేసులు నమోదు : కేంద్ర హౌంమంత్రికి సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ లేఖ
న్యూఢిల్లీ: బహుళ ఆలోచనలకు, భిన్నత్వంలో ఏకత్వానికి మారు పేరుగా నిలిచే కేరళపై హిందూ మతోన్మాద శక్తులు దుష్ప్రచారానికి ఒడిగట్టాయి. 32 వేల మంది హిందూ, క్రైస్తవ మహిళలు ఐసిస్ లో చేరారనీ, కేరళ ఇస్లామిక్ రాష్ట్రంగా ఉన్నదని దుష్ప్రచారం చేస్తూ ది కేరళ స్టోరీ పేరుతో హిందీ సినిమా తీశారు. దీనికి సంబంధించిన టీజర్‌ను నవంబర్ 3న విడుదల చేశారు. సంఘపరివార్ సానుభూతి పరులుగా ఉన్న సుదీప్తో సేన్ దర్శకత్వం వహించగా, విపుల్ అమృతలాల్ షా నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) తీవ్రవాద శ్రేణులలో చేరడానికి తీవ్రవాదులైన కేరళ నుంచి 32,000 మంది మహిళల హృదయ విదారక కల్పిత కథలను ఈ చిత్రంలో పేర్కొన్నారు. కేరళ నుంచి ఐసిస్ లో చేరిన వారిలో చాలా మంది ముస్లిం మహిళలు తీవ్రవాద సంస్థ ఐసిస్ కు వెళ్లాలనే ఉద్దేశంతో మతం మార్చుతున్నట్టు చిత్రంలో తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దు ముందు ఒక ముస్లిం మహిళ తన కథను వివరిస్తున్నట్లు ట్రైలర్లో చూపబడింది. ఆ పాత్రలో నటించిన నటి అదా శర్మ సరిహద్దు వద్ద మాట్లాడే వీడియోను టీజర్‌గా విడుదల చేశారు. అందులో ఇంతకుముందు తాను షాలినీ ఉన్ని కృష్ణన్‌గా ఉండేదాన్ని, నర్సుగా ప్రజలకు సేవ చేయాలనుకునేదాన్ని, ఆమె బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చినట్టు తెలుపుతుంది. ఫాతిమాగా పేరు మార్చినట్టు, ఆపై ఐసిస్‌కి ఉగ్రవాదిగా మారినట్టు, చివరికి ఆఫ్ఘనిస్తాన్ జైలులో బంధించబడినట్లు టీచర్లో ఆమె చెబుతుంది. 'ది కేరళ స్టోరీస్ 32 వేల మంది కేరళ నుంచి మతం మారిన ముస్లిం మహిళలను యెమెన్, సిరియా ఎడారులలో పాతిపెట్టడానికి మాత్రమే ఉగ్రవాదులుగా ఐసిస్‌కి పంపబడిన కల్పితాలను, కేరళ గౌరవానికి వ్యతిరేకంగా సినిమాలో పొందుపరిచారు. కేరళలో గత కొన్నేళ్లుగా సాధారణ అమ్మాయిలను ఐసిస్ ఉగ్రవాదులుగా మార్చే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని అసత్యాలను ఈ సినిమా ప్రచారం చేస్తోంది. ఈ సినిమాను నిషేధించాలని తమిళనాడుకు చెందిన జర్నలిస్టు అరవిందక్ష్యన్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఫిర్యాదు చేశారు. పినరయి విజయన్ ఈ కేసును రాష్ట్ర డీజీపీకి పంపారు. రాష్ట్ర డీజీపీ సైబర్ సెల్‌కు పంపింది. సైబర్ సెల్ ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేసింది. అలాగే సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్, కేంద్ర హౌం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ది కేరళ స్టోరీ సినిమా టీజర్ తప్పుడు ప్రచారం చేస్తోందనీ, ఇది కేరళ పరువు తీయడమే కాకుండా సామరస్యం, లౌకికవాదం, జాతీయ ఐక్యతకు ముప్పు తెస్తోందని లేఖలో పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హౌం మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌ను కూడా కోరారు.