Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు ఎన్. చంద్రబాబు నాయుడికి పటిష్ట భద్రత కల్పించాలని కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర హౌం శాఖ కార్యదర్శి ఏ. కె. భల్లాను టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన వారికి వేర్వేరుగా లేఖలు రాశారు. చంద్రబాబుకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్నా, అధికార వైసిపి క్రూరమైన రాజకీయాలతో ఆయనపై దాడులకు తెగబడుతోందని లేఖలో పేర్కొన్నారు.