Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోమవారం ఆదేశాలు వెలువరించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బోయినపల్లి అభిషేక్ బెయిలుపై సీబీఐ ప్రత్యేక కోర్టులో వాదనలు ముగిశాయి. సోమవారం ఆదేశాలు వెలువరిస్తామని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంకె నాగపాల్ తెలిపారు. అభిషేక్ బోయినపల్లి, విజరునాయర్ల బెయిలుపై విచారణ సందర్భంగా సిబిఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిసూ.. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున అభిషేక్‌కు బెయిలు ఇస్తే సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. 30 రోజులుగా జైలులోనే ఉన్నారని అభిషేక్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. నగదు లావాదేవీలన్నీ చట్టబద్ధంగానే జరిగాయని వివరించారు. నగదు లావాదేవీలు జరిగిన మాట వాస్తవమే కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆంధ్రప్రభ పబ్లికేషన్ సబ్సిడరీ ఇండియా ఎహెడ్ ఛానల్ లోగోను కొనుగోలు చేస్తే ఆంధ్రప్రభలోనూ అభిషేక్‌కు వాటా ఉందనడం సరికాదని తెలిపారు. ఆంధ్రప్రభ ఖాతాలో రూ.1.75 కోట్ల జమ చేయడానికి తమకూ సంబంధం లేదని పేర్కొన్నారు. 47 రోజులుగా సంబంధం లేని వ్యక్తిని అరెస్టు చేసి విచారిస్తున్నారని విజరు నాయర్ తరపు న్యాయవాది తెలిపారు. విజరు నాయర్ ఇంట్లో రెండు సార్లు సోదా చేసినా ఏమీ దొరకలేదని, దర్యాప్తునకు సహకరిస్తున్నామని తెలిపారు. బెయిలు మంజూరు చేయాలని కోరారు. వాదనలు పూర్తయిన అనంతరం సోమవారం ఆదేశాలు ఇస్తామని న్యాయమూర్తి విచారణ వాయిదా వేశారు.