Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశాఖలో ఏపీ సర్కారు దౌర్జన్యకాండ
- 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు'.. మోడీ గో బ్యాక్ అంటూ దిక్కులు నినాదాలు
విశాఖ : విశాఖలో ప్రధాని మోడీ అడుగుపెట్టక ముందే రాష్ట్ర ప్రభుత్వం తన పోలీసులతో స్టీల్‌ప్లాంట్ కార్మికవర్గంపై దౌర్జన్యకాండకు బుధవారం దిగింది. పోలీసులు భారీ స్థాయిలో రంగంలోకి దిగి అడుగడుగునా ఆటంకాలు సృష్టించి అరెస్టులకు దిగారు. ఈ నెల 11, 12 తేదీల్లో దేశ ప్రధాని విశాఖ పర్యటన ఖరారైన సంగతి తెలిసిందే. స్టీల్‌ప్లాంట్ అమ్మకాన్ని ప్రధానమంత్రి ఆపాలని, విశాఖలో ఈ ప్రకటన చేసేలా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కృషిచేయాలనీ, లేదంటే ఎంతటి ప్రాణత్యాగానికైనా వెనకాడమంటూ ప్రజలు, కార్మికులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఉక్కు పరి రక్షణ పోరాట కమిటీ, అఖిలపక్ష కార్మిక సంఘాల జెఎసి ఆధ్వర్యాన ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం బుధవారం ఉదయం స్టీల్‌ప్లాంట్ గేటు నుంచి విశాఖ నగరంలోని జీవీఎంసీ వద్దకు తలపెట్టిన బైక్‌ర్యాలీని అడుగడుగునా పోలీ సులు నిర్బంధంతో అడ్డుకున్నారు. నగరంలోకి కార్మికుల ను రాకుండా వందల సంఖ్యలో బలగాలను ప్రభుత్వం దింపింది. అయినాసరే వెరవకుండా కార్మికవర్గం దిక్కులు పిక్కటిల్లేలాగ 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు'... ప్రధాన మంత్రి మోడీ గో బ్యాక్'..అంటూ నినాదాలు పెద్దపెట్టున చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యాన ఇచ్చిన పిలుపునకు బుధవారం కూర్మన్నపాలెం గేటువద్దకు ఉదయాన్నే కార్మికులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఉదయం 6గంటల నుంచే కార్మికులు తమ కార్యక్రమాన్ని రద్దుచేసుకోవాలంటూ పోలీసులు అడ్డు తగు లుతూ, ర్యాలీ ముందుకు సాగకుండా బారి కేడ్లను అడ్డంగా పెట్టేశారు. 9.30గంటల సమయంలో కార్మికులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.