Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 వ సీజేఐగా ప్రమాణస్వీకారం చేయించిన రాష్ట్రపతి
- ప్రధాని మోడీ గైర్హాజరు
- సామాన్య ప్రజలకు సేవ చేస్తా : జస్టిస్ చంద్రచూడ్
న్యూఢిల్లీ: ఉదారవాద, అభ్యుదయ న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ (డివై) చంద్రచూడ్ దేశ ప్రజలకు ఆశాకిరణంగా నిలిచారు. బుధవారం ఆయన ఈ మేరకు దేశ 50 వ సీజేఐగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఉదయం 10 గంటలకు జస్టిస్ డివై చంద్రచూడ్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన నియామక పత్రాలపై సంతకం చేసి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు తెలిపారు. తల్లి, కుటుంబ సభ్యులకు పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, మాజీ సీజేఐ జస్టిస్ యుయు లలిత్, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు పియూశ్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్ సింగ్ పూరీ, లోక్సభ కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, తదితరులు పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఉన్న ప్రధాని మోడీ ఈ కార్యక్రమానికి గైర్హాజరు అయ్యారు.
నా పనితో న్యాయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఉండేలా చూస్త్ణా జస్టిస్ చంద్రచూడ్ అనంతరం సుప్రీం కోర్టుకు చేరుకున్న సిజెఐ జస్టిస్ చంద్రచూడ్ కోర్టు ఆవరణంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ 'సామాన్య ప్రజలకు సేవ చేస్తా. సాంకేతికత, రిజిస్ట్రీ సంస్కరణలు, న్యాయపరమైన సంస్కరణల పరంగా మీరు రాబోయే రోజుల్లో చూస్తారు'' అని అన్నారు. ''ఇది ఒక గొప్ప అవకాశం, బాధ్యత. మాటల ద్వారానే కాదు, నా పని ద్వారా న్యాయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఉండేలా చూస్తాను' అని ఆయన అన్నారు. న్యాయవాదులకు కోర్టు ముందు వాదించడం, కేసులను నిర్వహించడం ఒత్తిడి లేని వ్యవహారంగా ఉండేలా ప్రయత్నిస్తానని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. తన ప్రమాణ స్వీకారోత్సవం తరువాత కేసుల విచారణకు కూర్చున్న ఆయన న్యాయవాదులను ఉద్దేశించి ఇలా అన్నారు. ''బార్ సభ్యులను వేచి ఉంచినందుకు క్షమాపణలు. ప్రతి ఒక్కరికీ ఒత్తిడి లేని కోర్టుగా మార్చడానికి నేను ప్రయత్నిస్తాను'' అని అన్నారు. అనంతరం న్యాయవాదులు ఆయనకు అభినందనలు తెలియజేసి, ఆయన పదవీబాధ్యతల్లో కొనసాగాలని ఆకాంక్షించారు. సీజేఐ జస్టిస్ యుయు లలిత్ అక్టోబర్ 11న తన వారసుడిగా జస్టిస్ చంద్రచూడ్ పేరును కేంద్రానికి సిఫారసు చేశారు. అక్టోబర్ 17న జస్టిస్ చంద్రచూడ్ 50వ సీజేఐగా రాష్ట్రపతి నియమించారు.
దేశ న్యాయ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం
ఇది దేశ న్యాయ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం. ఎందుకంటే ఇది జస్టిస్ చంద్రచూడ్, ఆయన తండ్రి, మాజీ సీజేఐ యశ్వంత్ విష్ణు (వైవి) చంద్రచూడ్ సీజేఐ స్థానానికి చేరుకున్న ఏకైక తండ్రీ-కొడుకుల ద్వయంగా మారింది. వైవి చంద్రచూడ్ (1978 ప˜ిబవరి 22 నుంచి 1985 జులై 11 వరకు) ఏడేండ్ల పైబడి సుదీర్ఘంగా దేశ 16వ సీజేఐగా బాధ్యతల నిర్వర్తించారు. ఇప్పటి వరకు ఎక్కువ కాలం సీజేఐగా బాధ్యతల చేపట్టిన వారు కూడా జస్టిస్ వైవి చంద్రచూడే. 44 ఏండ్ల ఏడు నెలల, 17 రోజుల తరువాత మళ్లీ ఆయన కుమారుడు జస్టిస్ డివై చంద్రచూడ్ సీజేఐగా బాధ్యతలు చేపట్టారు