Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షరతులేంటో మాకు తెలపండి
- ఎన్ఐఎకి సుప్రీం కోర్టు సూచన
న్యూఢిల్లీ: భీమా కోరేగావ్ కేసు నిందితుడు గౌతం నవ్లాఖా తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇంటికి పంపేందుకు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పు నేడు (గురువారం) వెలువరించ నుంది. ''ఆయనకు గృహ నిర్బంధాన్ని కస్టడీగా పరిగణించింది. ఆంక్షలుతో అనుమతి ఇస్తాం. ఆయన ఆరోగ్యం బాగాలేదు'' అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. 2020లో అక్టోబర్‌లో చార్జిషీట్ దాఖలు చేయశారనీ, ఇంకా ప్రారంభం కాని విచారణలో జాప్యంపై ధర్మాసనం విచారణ వ్యక్తం చేసింది. ''ఇది కొంచెం కలవరపెడుతోంది. మీ దగ్గర చాలా మెటీరియల్ ఉంటే, ఎందుకు విచారణలో జాప్యం. 70 ఏల్ల వ్యక్తి దారుణంగా ఉన్నారు. అతను తన స్వేచ్ఛను కోల్పోతాడు'' అని పేర్కొంది. 73 ఏండ్ల మానవ హక్కుల కర్యకర్త గౌతం నవ్లాఖా ఆగస్టు 2018లో అరెస్టు అయ్యారు. అప్పటి నుంచి కస్టడీలో ఉన్నారు. ఆయన చర్మ అలెర్జీ, దంత సమస్యలతో సహా తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నారని, అనుమానిత క్యాన్సర్‌ను పరీక్షించడానికి కొలనోస్కోపీ చేయాల్సిన అవసరాన్ని ఉదహరిం చారు. తన సోదరి ఇంటికి మార్చాలని చేసిన ప్రార్థనను ముంబయి హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 29న ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించడంతో ఆయనకు నచ్చిన ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. బుధవారం విచారణలో కపిల్ సిబల్ జైలులో చికిత్స తీసుకొనే అవకాశం లేదని, వైద్య నివేదికలు చెబుతున్నా యని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. నవ్లాఖా అండర్ ట్రయల్‌లో ఉన్నారని, దోషి కాదని నొక్కి చెప్పారు. ఎన్ఐఏ తరపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు నవ్లాఖా పరిస్థితి మెరుగుపడిందని, ప్రస్తుతం అతనికి ఎలాంటి సమస్యలు లేవని అన్నారు. తాము అన్ని అవసరాలు తీర్చుతామని, ఇంటి ఆహారాన్ని అందించేందుకు అనుమతిస్తామని ఎఎస్‌జీ తెలిపారు. అయితే కపిల్ సిబల్ జోక్యం చేసుకొని స్టాన్ స్వామికి ఏమీ జరగలేదని, ఆయన చనిపోయారని గుర్తు చేశారు. ఈ తరుణంలో నవ్లాఖా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్ఐఎను ధర్మాసనం ఆదేశించింది.