Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయ నియామకాల్లో జాప్యంపై కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శికి సుప్రీంకోర్టు నోటీసు
న్యూఢిల్లీ : న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను నిలుపుదల చేయడం ఆమోదయోగ్యం కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శికి నోటీసులు జారీచేసింది. న్యాయమూర్తులుగా నియామకం కోసం కొలీజియం సిఫారసు చేసిన పేర్లను ప్రాసెస్ చేయడంలో కేంద్ర ప్రభుత్వ జాప్యాన్ని ప్రశ్నిస్తూ బెంగళూరుకు చెందిన అడ్వకేట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజరు కిషన్ కౌల్, జస్టిస్ ఎఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం విచారించింది. 'రెండోసారి తెలియజేసిన తరువాత, అపాయింట్మెంట్ మాత్రమే జారీచేయాలి. పేర్లను నిలుపుదల చేయడం ఆమోదయోగ్యం కాదు. ఇలా చేయడంవల్ల వారి పేర్లను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేయడంగా ఉంటుంది' అని తెలిపింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తరపున సీనియర్ న్యాయవాది వికాస్‌సింగ్ వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టులో నియామకాలను నిలిపివేసినందుకు కేంద్రంపై ధిక్కార చర్యలను తీసుకోవాలని ధర్మాసనాన్ని కోరారు. కొలీజియం ప్రతిపాదించిన జయతోష్ మజుందార్ ఇటీవల మరణించారని అన్నారు. జస్టిస్ దీపాంకర్ దత్తా పేరును ప్రతిపాదించి ఐదు వారాలైందనీ, దానిని రెండు రోజుల్లో ఆమోదించాల్సి ఉందని తెలిపారు. దీనిపై జస్టిస్ కౌల్ స్పందిస్తూ ధర్మాసనం ఇంకా ధిక్కార నోటీసు జారీ చేయబోవడం లేదనీ, నియామకాల్లో జాప్యాన్ని ఎత్తిచూపుతూ, దాని కోసం కేంద్రం పదే పదే ఎలా ఒత్తిడి చేస్తుందని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం 11 పేర్లు పెండింగ్‌లో ఉన్నాయనీ, వాటిలో 2021 సెప్టెంబర్ నాటివని జస్టిస్ కౌల్ పేర్కొన్నారు. పిటిషనర్ తరపున న్యాయవాది అమిత్ పారు వాదనలు వినిపించారు. నియామకాల ప్రక్రియలో జాప్యానికి గల కారణాలపై కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని వివరణ కోరుతూ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. 2019 జూలై 24న కలకత్తా, జమ్మూకాశ్మీర్, కర్నాటక, అలహాబాద్ హైకోర్టులకు 11 మంది న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. మళ్లీ 2021లో రెండోసారి కూడా కేంద్రాన్ని పునరుద్ఘాటించింది. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టింది.
జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో
కొలీజియంలో ఆరుగురు సభ్యులు
సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు కొలీజియంలో 2023 మే 15 వరకు ఐదుగురు కాకుండా ఆరుగురు న్యాయమూర్తులు ఉంటారు. సీజేఐ జస్టిస్ డివై చంద్ర చూడ్‌తో పా టు కొలీజియంలో న్యాయమూర్తులు జస్టిస్ సంజరు కిషన్ కౌల్, జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉంటారు. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తరువాత జస్టిస్ సంజీవ్ ఖన్నా సీజేఐ అవుతారు. అయితే ఐదుగురు సభ్యుల కొలీజియంలో ఆయన లేరు. సీజేఐ చంద్రచూడ్ కాకుండా మిగిలిన నలుగురు సభ్యులు సీజేఐగా కాలేరు. కొలీజియంలో తప్పనిసరిగా తరువాత సీజేఐ అయ్యే సభ్యులు ఉండాలి.
అందువల్ల ఆరో సభ్యునిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను కొలీజియం సభ్యుడు తీసుకున్నారు. 2023 మే 15న జస్టిస్ ఎంఆర్ షా పదవీ విరమణ చేయడంతో కొలీజియం దాని సాధారణ సంఖ్య ఐదుకి తిరిగి వస్తుంది. గతంలో మూడేళ్ల, 117 రోజుల సుదీర్ఘ పదవీకాలంలో ఉన్న 37వ సీజేఐ జస్టిస్ కెజి బాలకృష్ణన్ హయంలో ఇలానే జరిగింది. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ పదవీకాలం సుదీర్ఘంగా ఉన్నందున కొలీజియం కూర్పులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. న్యాయమూర్తులు కౌల్, నజీర్, జోసెఫ్, షా, ఖన్నా సభ్యులుగా కొలీజియం ప్రారంభమవుతుంది. సీజేఐ చంద్రచూడ్ పదవీకాలంలో వివిధ సందర్భాలలో జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషికేష్ రారు, జస్టిస్ అజరు రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ ఎఎస్ బోపన్న అందరూ కొలీజియంలో సభ్యులుగా ఉంటారు. చివరి ముగ్గురు ఈ సమయంలోనే పదవీ విరమణ చేస్తారు. నవంబర్ 2024 నాటికి కొలీజియంలో జస్టిస్‌లు ఖన్నా, సూర్యకాంత్, గవారు, హృషికేష్ రారు ఉంటారు. వీరంతా రాబోయే సంవత్సరాల్లో సీజేఐలుగా పదోన్నతి పొందుతారు. జస్టిస్ చంద్రచూడ్ పదవీ విరమణ చేసిన తరువాత జస్టిస్ అభరు ఎస్ ఓకా కొలీజియంలో సభ్యుడవుతారు.