Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాదనలు వినేందుకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుచేసిన సుప్రీం
న్యూఢిల్లీ : వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో కనుగొన్న శివలింగానికి ఇస్తున్న రక్షణను పొడగిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ శివలింగానికి రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది. జ్ఞానవాపి-కాశీ విశ్వనాథ్ కేసు వినేందుకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. శివలింగం ఉంటున్న ఏరియాకు రక్షణ కొనసాగించాలని ఒక వర్గానికి చెందినవారు తమ పిటిషన్లో సుప్రీంకోర్టులో కోరారు. హిందూ భక్తుల తరఫున హాజరైన న్యాయవాది విష్ణు శంకర్ వాదనలను భారత ప్రధాన న్యాయమూర్తి డి.వి.చంద్రచూడ్‌తో కూడిన బెంచ్ గురువారం విచారించింది.