Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిమ్లా : ప్రపంచంలోనే అతి ఎత్తైన పోలింగ్ కేంద్రంగా గుర్తింపు పొందిన హిమాచల్ ప్రదేశ్లోని తాషిగాంగ్లో 98.08 శాతం పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తం 52 మంది ఓటర్లు నమోదయ్యారు. వీరిలో ఒకరు మినహా అందరూ అంటే 51 మందీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నా రు. సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తు లో ఈ పోలింగ్ స్టేషన్ వుంది. ఈ సారి ఎన్నికల్లో వందేళ్ళు దాటిన ఇద్దరు వ్యక్తులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం విశే షం. 83 ఏళ్లు నిండిన మహిళ డోల్మా ఏకంగా 14 కిలో మీటర్లు నడిచి వెళ్ళి తన ఓటు వేశారు.