Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో క్రిమినల్ ప్రొసీడింగ్స్ రద్దు : ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు
రాంచీ : రాష్ట్రంలో 2019లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోడ్‌ను ఉల్లంఘించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్‌కు ఊరట లభించింది. ఆయనపై క్రిమినల్ ప్రొసీడింగ్‌లను జార్ఖండ్ హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై మూడేండ్ల క్రితం అర్గోరా పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దీనిని హేమంత్ సొరేన్ సవాలు చేశారు. రాంచీలోని జ్యుడీషియల్ మేజిస్ట్రేటు కోర్టు ఇంతకుముందు సోరెన్‌కు సమన్లు జారీ చేసింది. వ్యక్తిగతంగా హాజరు కావాలనీ ఆదేశించింది. దీనిని కూడా ఆయన కోర్టు ముందు సవాలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ సంజరు కుమార్ ద్వివేది కోర్టుకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటు కేసు దాఖలు చేశారనీ, అయితే ఈ విషయంలో ఫిర్యాదు మాత్రమే నమోదు చేయొచ్చని చట్టం తెలుపుతున్నదన్నారు. ఈ కేసులో అన్ని పక్షాల వాదనలను విన్న న్యాయస్థానం.. సాంకేతిక లోపం ఉన్నదని నిర్ధారించింది. సొరెన్‌పై క్రిమినల్ ప్రొసీడింగ్‌లను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.