Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత రాజకీయాలకు తెరలేపిన మోడీ సర్కార్
- టికెట్టు ఇచ్చిన అమిత్ షా, ప్రధాని మోడీకి కృతజ్ఞతలు : పాయల్ కుక్రానీ
న్యూఢిల్లీ : గుజరాత్ మత ఘర్షణల్లో అమాయక ముస్లిం పౌరులను చంపిన నేరస్థుడ్ని బీజేపీ అక్కున చేర్చుకుంది. 2002లో అహ్మదాబాద్‌కు సమీపంలోని నరోడా పాటియా ప్రాంతంలో వేలాది ముస్లింలపై దాడులు జరిగాయి. ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకొని సాగిన ఊచకోతలో 97మంది ముస్లింలు చనిపోయారు. ఈ మారణకాండకు సంబంధించిన కేసులో 16మంది దోషులుగా తేలారు. అందులో ఒకడు మనోజ్ కుక్రానీ. అతడి కుమార్తె పాయల్ కుక్రానీ (30)ని ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బరిలోకి దింపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ స్వయంగా రూపొందించిన ఎన్నికల అభ్యర్థుల జాబితాలో మనోజ్ కుక్రానీ కుమర్తెకు టికెట్టు లభిం చటం..గుజరాత్లో సంచలనంగా మారింది. ఆమెకు నరోడా అసెంబ్లీ స్థానం నుంచి టికెట్టు దక్కింది. గుజరాత్ అల్లర్ల కేసులో దోషిగా తేలిన ఓ నేరస్థుడి కుమార్తెను బీజేపీ ఎంచుకోవటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.
పాయల్ తండ్రి మనోజ్ కుక్రానీ..నరోడా అల్లర్ల కేసులో దోషిగా తేలాడు. 2002లో గుజరాత్లో గోద్రా అల్లర్ల తర్వాత నరోడా పాటియాలో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ముస్లింలు లక్ష్యంగా ఊచకోత సాగింది. 97మంది అమాయక పౌరులు కోల్పోయారు. ఈ కేసులో మనోజ్ సహా 16 మంది దోషులుగా తేలుస్తూ కింది కోర్టులు తీర్పునిచ్చా యి. 2018లో వీరి శిక్షను గుజరాత్ హైకోర్టు సమ ర్థించింది. ఈ కేసులో జీవితఖైదు పడిన మనోజ్.. ప్రస్తుతం పెరోల్ పై బయట తిరుగుతున్నా డు. బీజేపీ ఎన్నికల అభ్య ర్థుల జాబితా విడుదల య్యాక.. ఆ పార్టీ నాయ కులే నోరెళ్ల బెడుతున్నారని సోషల్ మీడియాలో సందే శాలు వెలువడుతున్నాయి. తనకు బీజేపీ టికెట్టు లభిం చిందని తెలియగానే.. అమిత్ షా, ప్రధాని మోడీ లకు పాయల్ కుక్రానీ కృత జ్ఞతలు తెలియ జేసింది. ''మా అమ్మానాన్న ఎన్నో దశాబ్దాలుగా బీజేపీలో ఉన్నారు. గతంలోనూ బీజేపీ గెలుపుకోసం ఎన్ని కల్లో ప్రచారం చేశాను. ఎన్నికల్లో గెలిస్తే స్థానిక ప్రజల సమస్యలు పరిష్కరి స్తా''నని మీడియాతో మాట్లాడుతూ పాయల్ చెప్పుకొచ్చారు.