Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే కెటి జలీల్‌పై దాఖలైన పిటిషన్ తిరస్కరణ
న్యూఢిల్లీ :వాక్ స్వాతంత్య్రాన్ని అణచివేయలేమని ఢిల్లీ కోర్టు పేర్కొంది. కాశ్మీర్లో తన పరిశీలనకి వచ్చిన అంశాలను ఫేస్బుక్లో పోస్టు చేసిన కేరళకు చెందిన సీపీఐ(ఎం) ఎమ్మెల్యే కెటి జలీల్‌పై బీజేపీ నేత, న్యాయవాది జిఎస్ మణి దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. సమాజం చాలా అభ్యంతరకంగా భావించే చర్యలను వాక్ స్వాతంత్య్రం పరిరక్షిస్తుందని, కేవలం వాక్ స్వాతంత్య్రాన్ని అణచి వేసేందుకు సమాజంలో ఆగ్రహాలను సమర్థించలేమని పేర్కొంది. ఈ మేరకు రూస్ అవెన్యూ కోర్టు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ జస్పాల్ ఆదేశాలు జారీ చేశారు. కాశ్మీర్ ప్రజలు సంతోషంగా లేరని జలీల్ చేసిన ప్రకటన ఆయన అభిప్రాయం మాత్రమేనని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ఇచ్చిన ప్రాథమిక స్వేచ్ఛతో రక్షించబడిందని తెలిపింది.