Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ:న్యాయ నియామకాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి నేతల ప్రయేముందని, వారికి కావాల్సినవారినే కీలక పదవుల్లో నియమించుకుంటున్నారనే విమర్శల నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా మాజీ ప్రధానన్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ వార్తా సంస్థ ఎన్డిటివి ప్రతినిధికి విచ్చిన ఇంటర్వ్యూలో కొలీజియం వ్యవస్థ సహా అనేక అంశాలపై ఆయన మాట్లాడారు. గతంలో గుజరాత్‌కు సంబంధించిన సోహ్రాబుద్దీన్ షేక్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో తాను అమిత్ షా తరపున కోర్టుకు హాజరైన మాట వాస్తవమేనని జస్టిస్ యుయు లలిత్ తెలిపారు.