Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : రూ.32 కోట్ల విలువైన 61 కేజీల బంగారాన్ని ముంబయి కస్టమ్స్ అధికారులు ఆదివారం సీజ్ చేశారు. ఒక్కరోజు లో ఇంతపెద్ద మొత్తంలో బంగారం పట్టుబడటం ఇదే మొదటిసారని కస్టమ్స్ అధికారులు తెలిపారు. విదేశాల నుండి ముంబాయికి చేరుకున్న ఏడుగురు ప్రయాణికులు వద్ద బంగారు బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించామని అన్నారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పథకం ప్రకారం 61 కేజీల బరువు ఉన్న బిస్కట్లను 7 భాగాలుగా చేసి నడుము బెల్టులో దాచి తరలించేందుకు యత్నించినట్లు తెలిపారు. దీని కోసం స్పెషల్ గా నడుము బెల్టులను తయారు చేయించినట్లు వివరించారు. ఆఫ్రికా దేశం టాంజానియా నుంచి దోహా మీదుగా స్మగ్లర్లు ముంబయికి చేరుకున్నారని అన్నారు. దోహా ఎయిర్ పోర్టులో బంగారు బిస్కట్లతో ఉన్న నడుము బెల్టును సూడాన్ జాతీయుడు స్మగ్లర్లకు అప్పగించినట్లు సమాచారం.