Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డెహ్రాడూన్ : ఐదు మెడిసిన్ల ఉత్పత్తిని నిలిపివేయాలంటూ యోగా గురువు రామ్‌దేవ్ బాబాకు చెందిన దివ్యా ఫార్మసీపై ఉన్న నిషేధం తొలగిపోయింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ఆయుర్వేద, యునానీ లైసెన్సింగ్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. డయాబెటిస్, రక్తపోటు, గాయిటర్, గ్లాకోమా, అధిక కొలెస్ట్రాల్ వంటి ఐదు వ్యాధులకు సంబంధించిన మందులను ఉత్పత్తి చేయొద్దంటూ దివ్యా ఫార్మసీపై నిషేధం ఉండేది. ఇప్పుడు సంబంధిత విభాగం నుంచి నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు రావటంతో వాటి ఉత్పతికి మార్గం సుగమమైంది. గత ఆర్డర్లో తప్పు ఉన్నట్టు రాష్ట్ర హెల్త్ అథారిటీ జీసీఎన్ జంగ్పంగి తెలిపారు. ఉత్తర్వు ఇచ్చే ముందు వివరణ కోరుతూ కంపెనీకి కొంత సమయం ఇచ్చి ఉండాల్సిందన్నారు. కాగా, తప్పును సరిదిద్దినందుకు రామ్‌దేవ్ బాబా మిత్రుడు ఆచార్య బాలకృష్ణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.