Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటకలో 'ప్రాజెక్ట్ వివేకా'ను తలపెట్టిన బీజేపీ సర్కార్
- విద్యారంగాన్ని కాషాయీకరణ చేయటమేనని పలు వర్గాల నుంచి విమర్శలు
న్యూఢిల్లీ: కర్నాటకలో బీజేపీ సర్కార్ మరో వివాదాస్పద అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. విద్యను కాషాయీకరణ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ప్రాజెక్ట్ వివేకా పేరుతో రాష్ట్రంలోని 8వేల పాఠశాలను కాషాయరంగు తో నిర్మించనున్నామని కర్నాటక విద్యామంత్రి బి.సి.నగేశ్ తాజాగా ప్రకటించారు. దీనిపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి కల్బుర్గి జిల్లాలో మంత్రి ఆదివారం ప్రకటించారు. వివేకానంద శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్య క్రమంలో మంత్రి మాట్లాడుతూ.. వివేకా కొత్త క్లాస్‌రూమ్‌లు కాషాయరంగులో ఉండబోతు న్నాయని అన్నారు. ఈ అంశంపై పలువురు విద్యావేత్తలు పెదవి విరిచారు. విద్యారంగానికి మతం రంగు ఎందుకు పులమాలనుకుంటు న్నారని విద్యావేత్త డాక్టర్ నిరంజనాచార్య వి.కె. ప్రశ్నించారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేందు కు వీలుగా చైల్డ్ ఫ్రెండ్లీ క్లాస్‌రూమ్‌ల అవసర ముందని, మంత్రి ఇష్టాఇష్టాలతో.. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న రాజకీయ పార్టీ భావ జాలానికి అనుగుణంగా నిర్ణయాలు ఉండరాద ని అన్నారు. ఇది పూర్తిగా రాజకీయ, మతపర మైన ఉద్దేశాలతో విద్యారంగాన్ని కాషాయీకరణ చేసే వ్యవహారమేనని అన్నారు. రాజ్యాంగ మౌలిక విలువలకు పూర్తి విరుద్ధమని చెప్పారు. ఈ వివాదంపై మంత్రి నగేశ్ స్పందిస్తూ, కాషాయరంగు పెయింటింగ్ నిర్ణయాన్ని సరైన దేనని సమర్థించుకున్నారు. ఇది రాష్ట్ర ప్రభు త్వం తీసుకున్న నిర్ణయం కాదని, ప్రాజెక్ట్‌తో ప్రమేయమున్న ఆర్కిటెక్ట్ నిర్ణయమేనని వివరణ ఇచ్చారు. ఆర్కిటెక్ట్ చెప్పినదానిని బట్టే తాము ముందుకు వెళ్లాల్సి ఉందని అన్నారు. వివేకా క్లాస్ రూమ్ పథకం కింద పాతబడిన, విని యోగంలో లేని పాఠశాలల స్థానంలో కొత్తవి వివేకా క్లాస్‌రూమ్స్ పేరుతో నిర్మిస్తారు.