Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడి కస్టడీకి అప్పగింత
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం అవకతవకలపై సీబీఐ కేసుకు సంబంధించి హైదరాబాద్ వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి, ఆప్ కమ్యునికేషన్ ఇన్‌ఛార్జి విజరు నాయర్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిలు ఇవ్వగా ఈడీ అభ్యర్థన మేరకు ఐదు రోజుల కస్టడీకి అనుమతించింది. అభిషేక్, విజయ నాయర్ బెయిలు పిటిషన్లు విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎంకె నాగపాల్ రూ. 2 లక్షల పూచీకత్తుపై బెయిలు మంజూరు చేశారు. అనంతరం 14 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు చేపట్టి మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణ నిమిత్తం ఐదు రోజుల కస్టడీ అనుమతించింది.