Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రియురాలిని ముక్కలుగా నరికిన ఉన్మాది
న్యూఢిల్లీ : ఢిల్లీలో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకోవాలని అడిగిన ప్రియురాలిని ప్రియుడు కిరాతకంగా హత్య చేశాడు. ఆమెను చంపి మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికేశాడు. మే 18న ఈ హత్య జరగ్గా... ప్రాంతంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. శ్రద్ధ, అఫ్తాబ్ అమీన్ పూనావల్లా ఇద్దరు ప్రేమికులు. కొన్ని రోజులు సహజీవనం చేశారు. అయితే, తనను పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ, అఫ్తాబ్‌ను అడగడంతో ఆగ్రహానికి లోనైన అఫ్తాబ్ శ్రద్ధను హతమార్చాడని తెలుస్తుంది. పోలీసులు వివరాల ప్రకారం.. ముంబయికి చెందిన ఆప్తాబ్ కు తాను పనిచేసే కాల్ సెంటర్లో శ్రద్ధ అనే యువతితో పరిచయం ఏర్పడింది. మతాలు వేరుకావడంతో ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి నిరాకరిం చారు. దీంతో కొన్ని రోజుల క్రితం వీరు ఢిల్లీకి పారిపోయి మరీ సహజీవనం చేస్తున్నారు. అయితే ఒకరోజు పెళ్లి విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో కోపంతో ఊగిపోయిన ఆప్తాబ్ తన ప్రియురాలిని అత్యంత దారుణంగా హత్యచేసి ఆపై 35 ముక్కలుగా కోసి ఫ్రిజ్ లో దాచిపెట్టాడు. ఆ తర్వాత 18 రోజులకు ఢిల్లీలోని మెహ్రౌలీ అడవుల్లో పడేశాడు. కూతురు కనిపించటంలేదంటూ ఆమె తండ్రి ఫిర్యాదు చేయగా.. విచారణలో ఈ దారుణ ఘటన బయటపడింది. ఈ హత్య 6 నెలల క్రితం జరిగింది. ప్రస్తుతం అఫ్తాబ్ అమీన్ పూనావల్లా రిమాండ్‌లో ఉన్నాడు.