Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బాలిలో జరగబోయే జి-20 సదస్సులో అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే అంశాలపై చర్చించనున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. బాలికి బయలుదేరడానికి ముందుగా ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ అభివృద్ధిని పునరుద్ధరించడం, ఆహారం, ఇంధన భద్రత, పర్యావరణం, ఆరోగ్యం, డిజిటల్ పరివర్తన వంటి అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే కీలకాంశాలపై జి 20 నేతలతో చర్చించనున్నట్లు మోడీ చెప్పారు. కాగా, ఈ సమావేశాల్లో ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముందని భావిస్తున్నారు. సమావేశాల ముగింపులో అంటే డిసెంబరు 1వ తేదీన జి 20 అధ్యక్ష బాధ్యతలను భారత్ అధికారికంగా స్వీకరించనుంది. వచ్చే ఏడాది నిర్వహించబోయే జి-20 సదస్సు నిర్వహణా బాధ్యతలను భారత్ చేపట్టనుంది. అందరికీ సమానమైన అభివృద్ధి, భవిత్యవం వుండేలా ''వసుధైక కుటుంబం లేదా ఒక భూగోళం, ఒక కుటుంబం, ఒక భవితవ్యం'' అన్న థీమ్‌తో భారత్ జి 20 సమావేశాలు నిర్వహిస్తామని ప్రధాని ప్రకటించారు. ప్రపంచ జిడిపిలో దాదాపు 85శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున జి 20 అనేది అత్యంత ప్రభావవంతమైన, అంతర్జాతీయ ఆర్థిక సహకార బ్లాక్‌గా వుంది.