Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 133వ జయంతిని సోమవారం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. న్యూఢిల్లీలో నెహ్రూ స్మారక చిహ్నం శాంతివన్ వద్ద కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఇతరులు నెహ్రుకు నివాళి అర్పించారు. అనేక మంది నాయకులు సోషల్ మీడియా ద్వారా నెహ్రుకు నివాళి తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖార్గే తన ట్విట్టర్ ఖాతాలో ఆధునిక భారత నిర్మాతగా నెహ్రూను అభివర్ణించారు. నెహ్రూ యొక్క అధ్భుతమైన సహకారం లేకుండా 21వ శతాబ్దపు భారతదేశాన్ని ఊహించలేమని పేర్కొన్నారు. 'ప్రజాస్వామ్యం యొక్క విజేత. అతని ప్రగతిశీల ఆలోచనలు భారతదేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాయి. నిజమైన దేశభక్తుడికి నా వినయపూర్వకమైన నివాళి' అని ఖార్గే ట్వీట్ చేశారు.
నెహ్రూ సేవలను
గుర్తుచేసుకున్నాం : మోడీ
జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి మోడీ నివాళలు అర్పించారు.దేశానికి నెహ్రూ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.'జయంతి సందర్భంగా మాజీ ప్రధాని నెహ్రూ జీకి నివాళులు. దేశానికి నెహ్రు చేసిన సేవలను గుర్తు చేసుకున్నాం' అని మోడీ ట్వీట్ చేశారు.