Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం సిద్ధంగా వుంది : మంత్రి
శ్రీనగర్ : పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్రం సిద్ధంగా వుందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సోమవారం చెప్పారు. అయితే ఇటు వంటి చర్యకు రాష్ట్రాలు అంగీకరించే అవకాశం లేదన్నారు. '' జీఎస్టీ పరిధి లోకి పెట్రోల్, డీజిల్‌లను తీసుకు రావాలంటే, రాష్ట్రాలు అంగీకరించాల్సి వుంది. ఒకవేళ రాష్ట్రాలు అంగీకరిస్తే మేం సిద్ధంగా వున్నాం. దీన్నెలా అమలు చేస్తారా అన్నది తర్వాత విషయం, అయినా దాన్ని చూసుకోవాల్సింది ఆర్థిక మంత్రి'' అని పూరి ఇక్కడ విలేకర్లతో వ్యాఖ్యానించారు. లిక్కర్, ఇంధనమనేవి వారికి రెవిన్యూ ఆర్జించే అంశాలైనందు న బహుశా రాష్ట్రాలు ఈ చర్యకు అంగీకరించకపోవచ్చని మంత్రి పేర్కొ న్నారు. ''ఇందులో అర్ధం చేసుకోవడా నికి కష్టపడేదేమీ లేదు. దీన్నుండి రాష్ట్రాలకు ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తుంటే ఎవరైనా ఎలా వదులుకుంటారు? ద్రవ్యోల్బణం, ఇతర విషయాల గురించి ఆందోళన చెందేది కేంద్ర ప్రభుత్వం మాత్రమే'' అని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని జిఎస్టి కౌన్సిల్ ముందు పెట్టాల్సింది గా కేరళ హైకోర్టు సూచించిందన్నారు. 'కేరళ ఆర్థిక మంత్రి ఇందుకు అంగీ కరించలేదు. జీఎస్టీకి సంబంధించినం తవరకు, మీ కోరికలు, మా ఆకాంక్షలు వేర్వేరు, మేం సహకార సమాఖ్య వ్యవస్థ లో వున్నాం.' అని అన్నారు. గతేడాది కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు అతి తక్కువుగా పెంచిన దేశాల్లో భారత్ ఒకటని అన్నారు. ఉత్తర అమెరికాలో ఏడాది కాలంలో 43శాతం పెరిగితే భారత్‌లో కేవలం 2శాతం పెరిగాయన్నారు.