Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షులు డికె శివకుమార్‌ను ఈడీ సోమవారం విచారించింది. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. ఈ కేసులో శివకుమార్‌ను ఇడి విచారించడం ఇది రెండోసారి. 2019 సెప్టెంబరు3న కూడా ఈడీ శివకుమార్‌ను విచారించిన సంగతి తెలిసిందే. సోమవారం శివకుమార్‌తోపాటు అతని సోదరుడు డికె సురేష్‌ను కూడా ఇడి విచారించింది. యంగ్ ఇండియన్‌కు వివరాలు లేని భారీ మొత్తాన్ని శివకుమార్, సురేష్ విరాళం ఇచ్చారని ఈడీ ఆరోపిస్తుంది. సోమవారం విచారణ తరువాత విలేకరులతో శివకుమార్ మాట్లాడుతూ 'మేం ఇడిని గౌరవిస్తాం. ఇందులో దాచడానికి ఏమీ లేదు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం యంగ్ ఇండియన్‌కు మేం విరాళాలు ఇచ్చాం' అని తెలిపారు.