Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : బాడీ షేమింగ్‌కు వ్యతిరేకంగా విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై పాఠ్యాంశాల్లో భాగం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వి. శివన్కుట్టి తెలిపారు. బాడీ షేమింగ్ అనేది హేయమైన చర్య అని, దీంతో చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. ఆ సమయంలో బాధితుల కుటుంబసభ్యులు వారికి అండగా నిలవాలని చెప్పారు. విద్యార్థుల్లో అవగాహన కలిగించేందుకు పాఠ్యాంశాల్లో భాగంగా చేయడం గురించి చర్చిస్తున్నామని.. ఇటువంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ఉపాధ్యాయులకు కూడా శిక్షణనిచ్చేలా చూడాలని అన్నారు. ఒక వ్యక్తి రంగు, సంపద ఇవి ముఖ్యం కాదని... ఆదర్శంగా జీవించడం ముఖ్యమని అన్నారు.
తాను కూడా బాడీ షేమింగ్‌కు గురయ్యాయనని శివన్కుట్టి తెలిపారు. ఇటీవల తన ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేయగా... పొట్ట తగ్గించాలంటూ కింద వ్యాఖ్య జత చేశారని చెప్పారు. బాడీ షేమింగ్ హేయమైన చర్య అని సమధానమిచ్చానని శివన్కుట్టి తెలిపారు. వివరణనిచ్చినప్పటికీ... ఆ వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని చెప్పారు. ఇది మన సమాజంలో అనేక స్థాయిల్లో జరుగుతోందని అన్నారు. అలాగే తన స్నేహితుని సోదరుడుని గురించి వివరిస్తూ.. నల్లగా ఉన్నాడంటూ అవహేళన చేశారని, అతను డిప్రెషన్లోకి వెళ్లడంతో... అనేక పాఠశాలలు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు. ఈ చర్యలకు తక్షణమే ముగింపు పలకాలని స్పష్టం చేశారు.