Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కవి పత్తిపాక మోహన్‌కు సాహిత్య అకాడమీ బాల పురస్కారం అందుకున్నారు. సోమవారం నాడిక్కడ ప్రసిద్ధ త్రివేణి కళా సంఘం ఆడిటోరియంలో సాహిత్య అకాడమీ నిర్వహించిన బాల సాహిత్యోత్సవంలో పురస్కార ప్రధానం జరిగింది. సాహిత్య అకాడమీ అధ్యక్షులు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత చంద్రశేఖర్ కంబార్ బాల పురస్కారాన్ని ప్రధానం చేశారు. పురస్కారం కింద అకాడమీ తామ్ర ఫలకం, జ్ఞాపిక, రూ.50,000లతో సత్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ హిందీ బాల సాహితీవేత్త ప్రకాష్ మను హాజరై విశేష హాజరయ్యారు. ఆయన బాల సాహిత్య విశిష్టతను గురించి వివరించారు. అకాడమీ కార్యదర్శి కె శ్రీనివాసరావు పురస్కార గ్రహీతలనను పరిచయం చేసి, పురస్కారం అందుకున్న గ్రంథాలను పరిచయం చేశారు. అకాడమి ఉపాధ్యక్షులు మాధవ్ కౌశిక్ బాల సాహిత్యం పాత్రను గురించి విశేష ప్రసంగం చేసి, పురస్కార గ్రహీతలకు అభినందనలు అందించారు. ప్రముఖ బాల సాహితీవేత్త, కవి, అనువాదకులు, విమర్శకులు పత్తిపాక మోహన్, తెలుగులో 2022 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారానికి ఎంపికైన విషయం తెలిసిందే. మోహన్ రచించిన బాలల తాత బాపూజీ గేయ సంపుటికి ఈ పురస్కారం లభించింది.