Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 25 వేల జరిమానా
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ పరికరాల మార్గదర్శకాల పిటిషన్‌పై కేంద్రం ప్రతిస్పందించకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రూ. 25,000 జరిమానా విధిస్తున్నట్టు సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకునే ఎలక్ట్రానిక్ పరిరకాల్లో జీవితకాల సమాచారం ఉంటుందనీ, వాటిని భద్రపరచాల్సి వుంటుందని జస్టిస్ కౌల్, జస్టిస్ ఎం.ఎం.సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం ప్రజల జీవితాల్లో అవి భాగస్వామ్యమయ్యాయనీ, ఈ సమస్యపై అంతర్జాతీయంగా తీసుకుంటున్న చర్యలతో పాటు ఇతర వివరాలను రిక్డార్డ్లో ఉంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఆరువారాల సమయం ఇవ్వాల్సిందిగా అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు కోర్టుని కోరారు. ఈ పిటిషన్‌పై గత ఆగస్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
కేసు విచారణల్లో భాగంగా దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకునే ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందిం చాలంటూ కొందరు నిపుణులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొన్నేండ్ల పాటు తాము నిర్వహించిన విధులకు సంబంధించి అన్ని వివరాలు లాప్టాప్తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉంటాయని, దర్యాప్తు సంస్థలు వాటిని సరిగా భద్రపరచకపోతే కోలుకోలేని నష్టాలకు దారితీస్తాయంటూ జవహర్ లాన్ నెహ్రూ యూనివర్శిటీ ప్రొఫెసర్ రామ్ రామస్వామి, సావిత్రిబాయి పూలే పూణె యూనివర్శిటీ ప్రొఫెసర్ సుజాతా పటేల్, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాధవ్ ప్రసాద్, జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ ప్రొఫెసర్ ముకుల్ కేశవన్, సైద్దాంతిక పర్యావరణ ఆర్థికవేత్త దీపక్ మల్ఘన్లు ఆ పిటిషన్లో పేర్కొన్నారు.
ఓ కేసులో నిందితుని ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకునే సమయంలో డిజిటల్ డాక్యుమెంట్ల హాష్ విలువను ఢిల్లీ పోలీస్ అధికారి సమర్పించలేదని, సాక్ష్యాల ప్రామాణికతను ధ్రువీకరించడం కోసం తర్వాత కోర్టుకు అందిస్తామని పేర్కొన్నారు.