Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కీలక సహాయకుడు విజయ్ నాయర్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసులో సీబీఐ కస్టడీకి వ్యతిరేకంగా ఆయన బెయిల్ విచారణ జరగనున్న సమయంలో ఈ అరెస్ట్ జరగడం గమనార్హం. ఆప్ పార్టీ కమ్యూనికేషన్స్ చీఫ్ కూడా అయిన విజయ్ నాయర్ కొంతమంది మద్యం వ్యాపారుల కోసం లాబీయింగ్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్ పల్లి పాటు అరెస్టయ్యారు. ఇదే కేసులో వీరిద్దరూ సీబీఐ కస్టడీకి తీసుకున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు.