Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీఐ, బీసీటీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ
న్యూఢిల్లీ:తెలంగాణ బార్ కౌన్సిల్‌కు తాజాగా ఎన్నికలపై బార్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ), బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ (బీసీటీ)లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2018లో ఎన్నికైన బీసీటీ సభ్యులు నాటి నుంచి ఐదేండ్లపాటు పదవిలో కొనసాగవచ్చంటూ బీసీఐ 2022 నవంబరు 12న రాసిన లేఖను పక్కన పెట్టినట్టు తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ మంగళవారం విచారించారు. పిటిషనర్ తరపు ప్రదీప్ మహాజన్, తుషార్ మహాజన్, రోహన్ యాదవ్‌లు వాదనలు వినిపిస్తూ బీసీఐ లేఖ న్యాయవాదుల చట్టం 1961, సెక్షన్ 54ను ఉల్లంఘిస్తోందన్నారు. బార్ కౌన్సిల్ సభ్యుల పదవీకాలం రెండేండ్ల పాటు ఉంటుందని, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక బార్ కౌన్సిల్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ''17.11.2018న తెలంగాణ బార్ కౌన్సిల్‌కు ఎన్నికైన సభ్యులు 16.11.2020 వరకు రెండేళ్ల పాటు లేదా ఆ తర్వాత తాజా ఎన్నికలు అనుసరించి కొత్త సభ్యులు ఎన్నికయ్యే వరకు మాత్రమే పదవీ బాధ్యతలు నిర్వహించాలి. రెండేళ్ల తరువాత ఏ సందర్భంలోనైనా తాజా ఎన్నికలు నిర్వహించాలి'' అన్నారు.నేటికీ బీసీటీ సభ్యులు పదవీ బాధ్యతల్లో కొనసాగుతున్నారని చెప్పారు. రెండేళ్ల కాలపరిధికి మించి పదవుల్లో ఉన్నారని తెలిపారు. తదుపరి విచారణ 2023 మార్చి 14కు వాయిదా వేసింది.