Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : నూతన జాతీయ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)కు వ్యతిరేకంగా మంగళవారం ఉత్తరప్రదేశ్‌లో ఉపాధ్యాయులు కదంతొక్కారు. లక్నోతో పాటు జిల్లా కేంద్రాల్లోనూ ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన వేలాది మంది ఉపాధ్యాయులు లక్నోలోని ఇకో గార్డెన్ వద్ద భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని యోగి అదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)ను మళ్లీ అమలులోకి తీసుకునిరావాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను వచ్చే నెలలో జరిగే మున్సిపల్ ఎన్నికలలోపు అమలు చేయకపోతే తమ ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ ప్రత్మిక్ శిక్షక్ సంఫ్‌ు (యూపీపీఎస్ఎస్) బ్యానర్ కింద ఉపాధ్యాయులు ఈ ఆందోళనలు చేశారు. కొత్త పెన్షన్ పథకం ఉద్యోగులకు మరణం వంటిదని ఆందోళనకారులు ఆరోపించారు. కొత్త పథకంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి లాభం ఉండదని, అందుకే ఈ పథకాన్ని రద్దు చేయాలని పోరాటం చేస్తున్నామని యూపీపీఎస్ఎస్ అధ్యక్షులు సుశీల్ కుమార్ పాండే తెలిపారు. రాష్ట్రంలోని 75 జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కొత్త పథకానికి వ్యతిరేకంగా పదేళ్ల నుంచి పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని పాండే విమర్శించారు. ఎన్‌పిఎస్‌తో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పదవీ విరమణ పొందిన కొంతమంది ఉద్యోగులు ఎన్‌పిఎస్ కింద పొందుతున్న పెన్షన్‌తో కనీసం విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేకపోతున్నారని తెలిపారు. ఐదేళ్ల పాటు పదవీలో ఉండే ఎంపిలు, ఎమ్మెల్యేలు జీవిత కాల పెన్షన్ పొందుతూ ఉంటే.. 30 ఏండ్ల పాటు ఉద్యోగం చేసినవారికి పదవీ విరమణ తరువాత సరైన పెన్షన్ చెల్లించడం లేదని విమర్శించారు. పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరించకపోతే రానున్న 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే కీలక అంశంగా మారుతుందని ఉద్యోగులు హెచ్చరించారు. ఎన్నికలకు ముందు సుమారు 7 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్పీఎస్కు వ్యతిరేకంగా నిరససలకు దిగుతారని తెలిపారు.