Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ కాలేజీ ర్యాగింగ్, దాడి ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
- తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలతో పాటు యూజీసీకి నోటీసులు జారీ
న్యూఢిల్లీ : హైదరాబాద్ కాలేజీ ర్యాగింగ్, దాడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, యూజీసీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ శంకర్‌పల్లిలోని ఐబీఎస్ కాలేజీ హాస్టల్‌లో బీబీఏ ఎల్‌ఎల్‌బీ మొదటి సంవ త్సరం చదువుతున్న విద్యార్థిని ర్యాగింగ్ చేసి, క్రూరంగా దాడి చేసి, మతపర మైన నినాదాలు చేయాలంటూ బలవంతం చేశారంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటోగా స్వీకరించింది. బాధితుడు ఈ నెల 1న కళాశాల యాజమాన్యాన్ని ఆశ్రయించినప్పటికీ వారు వెంటనే స్పందించ లేదనీ, ఆయన ఈ-మెయిల్ ద్వారా పంపిన ఫిర్యాదుపై 11న మాత్రమే పోలీ సులు కేసు నమోదు చేశారని ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది. 2009లో ఉన్నత విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ను అరికట్టేందుకు యూజీసీ నిబంధనలు రూపొం దించినప్పటికీ ఏమీ మెరుగుపడలేదని ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది. ఈ ఘటన పై ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కమిషన్ నోటీసులు జారీ చేసింది. యూజీసీ నిబంధనల ప్రకారం ర్యాగింగ్‌ను నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో కాలేజీ యాజమాన్యం విఫల మవడానికి గల కారణాలు, తీసుకున్న చర్యలతో కూడిన నివేదికను అందజే యాలని ఆదేశించింది. ర్యాగింగ్‌కు పాల్పడినవారు, దాన్ని ప్రేరేపించేవారిపై చర్యలు తీసుకున్నారా? లేదా అనేది కూడా అందులో పేర్కొనాలని సూచిం చింది. బాధితుడిని కాలేజీ సస్పెండ్ చేస్తే, ఏ పరిస్థితుల్లో చేసిందో వివరిం చాలని కోరింది. 'విద్యా సంస్థల్లో ర్యాగింగ్ ముప్పు, దానిని అరికట్టడానికి చర్యలు' అనే అంశంపై రాఘవన్ కమిటీ చేసిన సిఫార్సులను సమర్థవం తంగా అమలు చేయడం గురించి నివేదికలను సమర్పించాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శి, యూజీసీ కార్యదర్శికి నోటీసు ఇచ్చింది.