Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మంగళవారం నాడిక్కడ ఎఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఖర్గేతో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఖర్గేను తొలిసారి కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య తెలంగాణ రాజకీయ అంశాలపై చర్చలు జరిగాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిని ఖర్గేకి రేవంత్ రెడ్డి వివరించినట్టు సమాచారం.