Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా గిరిజన విప్లవకారుడు బిర్సాముండా జయంతి
న్యూఢిల్లీ : గిరిజన విప్లవకారుడు బిర్సా ముండా స్మారకార్థం దేశవ్యాప్తంగా ఏఐకేఎస్ జెండా ఆవిష్కరణ (ప్లాగ్ డే)లు నిర్వహించింది. ఏఐకేఎస్ 35వ అఖిల భారత మహాసభ డిసెంబర్ 13 నుంచి 16 వరకు కేరళలోని త్రిసూర్‌లో జరుగనున్న నేపథ్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సాముండా 148వ జయంతిని దేశవ్యాప్తంగా నిర్వహిం చాలని పిలుపు నిచ్చింది. అందులో భాగంగా మంగళవారం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బిర్సాముండా జయంతి ఘనంగా జరిగింది. ఢిల్లీలోని ఏఐకేఎస్ ప్రధాన కార్యాలయంలో సంఘం ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ కోశాధికారి పి.కృష్ణప్రసాద్, ఐద్వా ఉపాధ్యక్షురాలు సుభాషిణి అలీ, ఏఐఏడబ్ల్యూయూ సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్, హర్యానా, ఒరిస్సా, మధ్యప్రదేశ్, త్రిపుర, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్, రాజస్థాన్, కేరళ, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో జెండా ఆవిష్కరణలు జరిగాయి.