Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెబీని కోరిన ఎఫ్హెచ్ఆర్ఎఐ
న్యూఢిల్లీ : ఓయో ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ప్రతిపాదనలను తిరస్కరించాలని ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేన్ ఆఫ్ ఇండియా (ఎఫ్హెచ్ఆర్ఎఐ) డిమాండ్ చేసింది. ఈ విషయమై రెగ్యులేటరీ సంస్థ సెబీకి ఎఫ్హెచ్ఆర్ఎఐ లేఖ రాసింది. అనైతిక వ్యాపార పద్ధతులకు పాల్పడుతున్న ఓయో ఐపీఓ కు అనుమతులివ్వద్దని కోరింది. ఓయోకు కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) జరిమానా విధించిన విషయాన్ని గుర్తు చేసింది. పోటీని అణచివేసే పద్ధతులు, అనైతిక వ్యాపారాలకు ఓయో పాల్పడుతోందని తెలిపింది. దీనివల్ల ఈ రంగంలోని చిన్న హోటళ్లు ఆర్థికంగా దెబ్బతింటున్నాయనీ.. ఈ పరిణామం ఎంత మాత్రం మంచిది కాదని ఎఫ్హెచ్ఆర్ఎఐ ఆందోళన వ్యక్తం చేసింది. రూ.8,430 కోట్ల ఐపీఓ నిధుల సమీకరణకు ఓయో గతేడాది అక్టోబర్లో సెబీకి దరఖాస్తు చేసుకుంది. అనైతిక వ్యాపార పద్ధతులు అవలంబిస్తూ.. వినియోగదారులను దండుకుంటున్నాయనే అరోపణలపై సీసీఐ విచారణ జరిపి ఇటీవల ఓయో, మేక్ మై ట్రిప్, గోఈబీబో సంస్థలకు గత నెలలో సీసీఐ రూ.392 కోట్ల జరిమానా విధించింది. ఈ విషయాన్ని ఎఫ్హెచ్ఆర్ఎఐ తాజాగా సెబీకి గుర్తు చేసింది.