Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ మధ్యం కుంభకోణంలోశరత్ చంద్రారెడ్డి భార్య సంస్థ వివరాలు కోరిన ఈడీ
న్యూఢిల్లీ : ఢిల్లీ మధ్యం కుంభకోణంలో ఈడి అరెస్టు చేసిన శరత్ చంద్రారెడ్డి భార్య కనికా టేక్రివాల్కు చెందిన 'జెట్ సెట్ గో' విమానయాన సంస్థ వివరాలను ఈడీ కోరింది. ఈ మేరకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఈడీ లేఖ రాసింది. గత నెల 17న ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఛైర్మెన్‌కు ఈడీ డిప్యూటీ డైరక్టర్ రాబిన్ గుప్తా రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శరత్ చంద్రారెడ్డి భార్య కనికా టేక్రివాల్ నడుపుతున్న 'జెట్ సెట్ గో' విమానయాన సంస్థ వివరాలు, నడిపిన ప్రత్యేక విమాన సర్వీసుల రాకపోకలపై వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొంది. 'జెట్ సెట్ గో' పేరుతో ప్రయి వేటు జెట్ చార్టర్డ్ విమాన సర్వీసులు కనికా టేక్రివాల్ నడుపుతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో చేతులు మారిని కోట్ల రూపాయలు నగదు కనికా ఏర్పాటు చేసిన విమానాల్లోనే తరలించినట్లు ఈడి అధికారులు అనుమానిస్తున్నారు. కనికా సీఈఓగా నిర్వహిస్తున్న 'జెట్ సెట్ గో' సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి లేఖ రాసిన తేదీ వరకు నడిపిన అన్ని ఛార్టర్ విమానాల వివరాలు ఇవ్వాలని కోరింది. ఆ ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన వారి వివరాలు, విమాన మేనేజర్ల జాబితా అందించాలని కోరింది. తాము అడిగిన సమాచారానికి సంబంధించిన అన్ని రకాల పత్రాలు పంపాలని ఈడి కోరింది. పీఎంఎల్ఎ చట్టం ప్రకారం జరుగతున్న విచారణలో భాగంగా ఈ వివరాలు కోరుతున్నట్లు ఈడీ స్పష్టం చేసింది.