Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జస్టిస్ నిఖిల్ ఎస్ కారియల్ బదిలీపై ఆందోళన
న్యూఢిల్లీ : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డి పాట్నా హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఆయనతో పాటు గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిఖిల్ ఎస్ కారియల్ను కూడా పాట్నా హైకోర్టుకు బదిలీ చేసింది. మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి రాజాను రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో జరిగిన కొలీజియం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 53 మంది న్యాయమూర్తుల ఉండాల్సిన పాట్నా హైకోర్టులో నవంబర్ 1 నాటికి 34 మంది న్యాయమూర్తులు ఉన్నారు. 19 న్యాయమూర్తి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జస్టిస్ నిఖిల్ ఎస్ కారియల్ను బదిలీని వ్యతిరేకిస్తూ వందలాది మంది న్యాయవాదులు ఆందోళనకు దిగారు. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ముందు ఆందోళనకు దిగారు. దాదాపు 300 మంది న్యాయవాదులు ఆందోళన చేపట్టారు.