Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిలిగుడి: కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతుండగా.. స్టేజీ పైనే అసౌకర్యానికి గురవడంతో వైద్యులు హుటాహుటిన ఆయనకు చికిత్స అందించారు.పలు అభివద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు గడ్కరీ గురువారం సిలిగుడిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతుంగా.. స్టేజీపైనే అస్వస్థతకు గురయ్యారు. దీంతో గడ్కరీని అక్కడే ఉన్న గ్రీన్ రూంకు తీసుకెళ్లారు. గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి హుటాహుటిన వైద్యుడిని రప్పించారు. గ్రీన్ రూంలో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత బిజెపి ఎంపి రాజు బిస్తా ఇంటికి తీసుకుని వెళ్లి గడ్కరీకి చికిత్స అందించారు. చక్కెర స్థాయి ఒక్కసారిగా తగ్గడంతో కేంద్రమంత్రి అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.