Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జంతర్ మంతర్లో బిఎంఎస్ ధర్నా
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగాన్ని అమ్మొద్దని బిజెపి అనుబంధ కార్మిక సంఘం బిఎంఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం నాడిక్కడ జంతర్ మంతర్లో ఆందోళన చేపట్టింది. ''ప్రభుత్వ రంగాన్ని కార్పొరేటీకరణ చేయొద్దు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలి, ఎంటిఎన్ఎల్, బిఎస్ఎన్ఎల్ల్లో పే రివిజన్, పెన్షన్ రివిజన్ చేయాలి. కార్మిక కోడ్లు రద్దు చేయాలి'' అని ప్లకార్డుల పట్టుకొని ఆందోళన చేపట్టారు. బిఎంఎస్ జాతీయ అధ్యక్షుడు హిరణ్మరు పాండా ప్రారంభిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఉత్పత్తులను వైవిధ్య పరిచి ఆర్థిక సహాయం అందించి సంస్థలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి రవీంద్ర హిమ్తే, కేరళ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె. విజయకుమార్, తెలుగు రాష్ట్రాల నేత లక్ష్మారెడ్డి తదితరులు మాట్లాడారు. యుపిఎ హయాంలో ఉమ్మడి ట్రేడ్ యూనియన్లో భాగమైన బిఎంఎస్ 2014లో మోడీ అధికారంలోకి వచ్చాక నమ్మక ద్రోహ వైఖరిని అవలంబించింది. ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్న ఓ సంస్థ మోడీపై స్పందించడం ఇదే తొలిసారి. కార్మిక వ్యతిరేక విధానాలపై మౌనం దాల్చడంపై ఆ సంస్థలో అసంతృప్తికి ఆజ్యం పోసినందున ఆందోళన చేపట్టింది.