Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు విధానాలను వ్యతిరేకిస్తూ బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని నవంబర్ 19న(శనివారం సమ్మె చేపడుతున్నామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రెటరీ వెంకటాచలం తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం వల్ల ఖాతాదారుల సొమ్ముకు, భద్రతకు విఘాతం కలుగుతుందన్నారు. ఈ విధానాల వల్ల ఉద్యోగాలతో పాటు, ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమ్మెతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నగదు లావాదేవీలపై ప్రభావం పడనుంది. ఈ విషయమై పలు బ్యాంక్‌లు ఆయా ఖాతాదారులకు సమాచారాన్ని ఇచ్చాయి.