Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేత దాఖలు చేసిన పిటిషన్ విచారణకు నిరాకరణ
న్యూఢిల్లీ : జనాభా నియంత్రణ చట్టం కోరుతూ బీజేపీకి చెందిన అశ్విని కుమార్ ఉపాధ్యారు దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. జనాభా నియంత్రణకు సంబంధించి సమగ్ర విధానాన్ని, చట్టాన్ని రూపొందించేలా లా కమిషన్ను ఆదేశించాలని కోరుతూ బీజేపీ నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యారు తదితరులు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్కె కౌల్, జస్టిస్ ఎఎస్ ఓకాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ పిటిషన్పై తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంటూ పిటిషన్ స్వీకరణకు ధర్మాసనం నిరాకరించింది. ప్రపంచ భూభాగంలో భారతదేశం కేవలం 2శాతం మాత్రమే కలిగి ఉండగా, జనాభాలో 20 శాతం ఉందని ఉపాధ్యారు వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. 'ఒక రోజులో జనాభాను తుడిచివేయలేరు. లా కమిషన్ను కూడా ఎలా నిర్దేశిస్తుంది' అని జస్టిస్ కౌల్ ప్రశ్నించారు. బలవంతపు కుటుంబ నియంత్రణకు వ్యతిరేకమని 2020 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది.
ఈడీ డైరెక్టర్ పదవీకాలం పొడిగింపుపై విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ కౌల్
ఇడి డైరెక్టర్ సంజరు కుమార్ మిశ్రా పదవీకాలం పొడిగింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజరు కిషన్ కౌల్ తప్పుకున్నారు. ప్రస్తుత డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంజరు కుమార్ మిశ్రా పదవీ కాలం పొడిగింపును సవాలు చేస్తూ జయ ఠాకూర్, సాకేత్ గోఖలే, రణదీప్ సింగ్ సూర్జేవాలా, మహువా మొయిత్రా దాఖలు చేసిన పిటిషన్లను శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ సంజరు కిషన్ కౌల్, జస్టిస్ ఎఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణను నుంచి తప్పుకుంటూ జస్టిస్ సంజరు కిషన్ కౌల్, ''సరైన ఆదేశాల కోసం ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచుతాను.
నేను ఈ అంశాన్ని విచారించలేను'' అని అన్నారు. మిశ్రా పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సెప్టెంబరు 2021లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించిందని పిటిషనర్లు వాదించారు. అయితే ఆయన పదవీకాలాన్ని రెండు నుండి మూడేళ్లకు పెంచింది. మిశ్రా తొలిసారిగా ఈడీ డైరెక్టర్గా 2018 నవంబర్లో రెండేళ్ల కాలానికి నియమితులయ్యారు. రెండేండ్ల పదవీకాలం 2020 నవంబర్లో ముగిసింది. 2020 మేలో ఆయన పదవీ విరమణ వయస్సు 60కి చేరుకున్నారు. అయితే, 2020 నవంబర్ 13 'రెండేళ్ల' కాలాన్ని 'మూడేళ్ల' కాలానికి మార్చే విధంగా రాష్ట్రపతి 2018 ఉత్తర్వును సవరించినట్లు పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం కార్యాలయ ఉత్తర్వును జారీ చేసింది. దీనిని కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.