Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీహరికోట : భారత్‌లో మొదటి ప్రయివేట్ రాకెట్ ''విక్రమ్ ఎస్'' ప్రయోగం విజయవంతమైంది. చెన్నైకి 115 కి.మీ దూరంలోని శ్రీహరికోట నుంచి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ ప్రయివేటు లిమిటెడ్ సంస్థ.. విక్రమ్-సబ్ ఆర్బిటల్ (వికెఎస్) ఈ ప్రైవేట్ రాకెట్‌ను అభివద్ధి చేసింది. 'విక్రమ్-ఎస్ గగనతలాన్ని అలంకరించిన భారతదేశపు మొదటి ప్రయి వేట్ రాకెట్‌గా చరిత్ర సష్టించింది. ఈ మహత్తరమైన సందర్భంగా మాతో ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు'' అని వికెఎస్ ఒక ట్వీట్లో ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం 2020 నుండి అంతరిక్ష రంగంలోకి ప్రయి వేట్ రాకెట్లకు అనుమతించినసంగతి తెలిసిందే.మన దేశంలో అంతరిక్ష ప్రయోగాలను ప్రారంభించిన ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయికి నివాళిగా తమ రాకెట్‌కు 'విక్రమ్-ఎస్' అని పేరు పెట్టినట్లు వికెఎస్ తెలిపింది. ఈ మొట్టమొదటి మిషన్‌కు 'ప్రారంభ్' అని నామకరణం చేశారు. వాస్తవానికి ఈనెల 12నే ప్రయోగం చేపట్టాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో నేటికి వాయిదా పడింది.