Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నేత ఫరూక్ అబ్దుల్లా శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. కొత్త తరానికి అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని, ఇకపై పార్టీ అధ్యక్ష పదవికి పోటీచేయనని పేర్కొన్నారు. డిసెంబర్ 5వ తేదీన నేషనల్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయనీ, పార్టీలో ఎవరైనా అధ్యక్ష పదవి కోసం పోటీ పడవచ్చని, ఇది ప్రజాస్వామ్య విధానమని పేర్కొన్నారు. జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను పునరుద్ధరించేంత వరకు ఎన్నికల్లో పోటీ చేయనని ఒమర్ అబ్దుల్లా ఇప్పటికే ప్రకటించారని అన్నారు. జమ్మూకాశ్మీర్‌లో అన్ని వర్గాల ప్రజలు భయం లేకుండా జీవించగలిగే పరిస్థితులు మళ్లీ రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఫరూక్ 1981లో తొలిసారి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షపదవికి ఎన్నికయ్యారు. 2002లో ఆ స్థానంలోకి ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా వచ్చారు. 2006లో తిరిగి ఫరూక్ ఆ పదవిని చేపట్టారు.