Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చారిత్రక ఘట్టం : కాంగ్రెస్
ముంబయి : కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేపడుతున్న భారత్ జోడోయాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతున్నది. శుక్రవారం ఉదయం బుల్దానా జిల్లాలోని షెగావ్‌లో జరుగుతున్న ఈ పాదయాత్రలో మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్‌గాంధీ పాల్గొన్నారు. దీంతో భారత్ జోడోయాత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కతమైందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. నవంబర్ ఏడు నుండి మహారాష్ట్రలో కొనసాగుతున్న పాదయాత్ర ఈ ఉదయం ఆరుగంటలకు అకోలా జిల్లాలోని బాలాపూర్ నుండి ప్రారంభమైందని, కొన్ని గంటల తర్వాత షెగావ్‌కు చేరుకుందని, రచయిత, మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్ గాంధీ రాహుల్‌గాంధీతో కలిసి నడిచారని పేర్కొంది. జవహర్లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీల ముని మనవళ్లైన రాహుల్ గాంధీ, తుషార్ గాంధీలు వారి వారసత్వపు వాహకాలని అభివర్ణించింది. ప్రస్తుత ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడి చేస్తోందని, ఇకపై సాగని వ్వమనే సందేశాన్నిచ్చారని పేర్కొంది. తుషార్ గాంధీతో పాటు ముకుల్ వాస్నిక్, దీపేందర్ హుడా, మిలింద్ డియోరా, మాణిక్‌రావ్ థాకరే, ముంబయి కాంగ్రెస్ అధ్యక్షుడు జగ్తప్, పార్టీ రాష్ట్ర యూనిట్ చీఫ్ నానా పటోల్ తదితరులు ఈ యాత్రలో పాల్గొన్నారు. కాగా, భారత్ జోడోయాత్రలో తాను పాల్గననున్నట్లు ప్రకటిస్తూ.. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూల ఫొటోలను తుషార్ గాంధీ గురువారం ట్విటర్లో పోస్ట్ చేశారు.