Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు అయిన అభిషేక్ బోయినపల్లికి మరో ఐదు రోజుల పాటు ఈడీ కస్టడికి సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. శనివారం రౌస్ అవెన్యూ కోర్టులో అభిషేక్ బోయినపల్లి, విజరు నాయర్లను హాజరు పరిచారు. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకె నాగ్పాల్ విచారించారు. అభిషేక్ బోయినపల్లి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డు చేశారనీ, ఏమీ స్వాధీనం చేయలేదని తెలిపారు. కస్టడీ అవసరం లేదని అన్నారు. ఈడీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అభిషేక్ రూ.వంద కోట్లు ముడుపులు ఇచ్చారని, అందులో రూ.30 కోట్లు హవాలా ద్వారా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తెచ్చారని తెలిపారు. ఈ కేసులో చందన్ రెడ్డి, బుచ్చిబాబులను విచారిస్తున్నామని, తమకు మరో తొమ్మిది రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని కోరారు. దీంతో న్యాయమూర్తు ఎంకె నాగ్పాల్ ఐదు రోజుల కస్టడీ ఇస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇదే కేసులు అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రరెడ్డి భార్య కనికా టేక్రివాల్ను ఈడీ శనివారం విచారించినట్టు సమాచారం.