Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సీపీఐ(ఎం) ఎంపీ ఎఎ రహీం లేఖ
న్యూఢిల్లీ : ఢిల్లీ యూనివర్సిటీలో చేరిన విద్యార్థులకు పెట్టే హిందీ తప్పనిసరి పరీక్ష (సీటీహెచ్)ను ఉపసహరించుకోవాలని సీపీఐ(ఎం) ఎంపీ ఎఎ రహీం డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. ఎబిలిటీ ఎన్‌హెన్స్‌మెంట్ కంపల్సరీ కోర్స్ (ఏఈసీసీ)లో ఇంగ్లీష్ ఆప్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2018, 2019, 2020, 2021లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు కంపల్సరీ టెస్ట్ ఇన్ హిందీ (సీటీహెచ్) రిజిస్ట్రర్ అయితే, వారికి డిగ్రీలు ఇస్తామని ఢిల్లీ యూనివర్సిటీ నవంబర్ 11న నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. అయితే ఇందులో ఇంగ్లీష్ ఉండేదనీ, కానీ ఇప్పుడు కేవలం హిందీ ఒక్కటే ఆప్షన్‌గా పెట్టారని పేర్కొన్నారు. కనుక ఈ విషయంలో జ్యోక్యం చేసుకొని, హిందీని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.