Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సవరించిన అమికస్ క్యూరీ రిపోర్టు
న్యూఢిల్లీ .2022 నవంబర్ నాటికి దేశంలో 5,097 మంది తాజా, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అమికస్ క్యూరీ విజరు అన్సారియా రిపోర్టు తెలిపింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డివై చంద్రచూడ్‌కు నవంబర్ 14న విజరు అన్సారియా 17 రిపోర్టును సమర్పించారు.
అప్పటి ఆరు రాష్ట్రాల హైకోర్టుల నుంచి సమాచారం అందలేదని అందులో తెలిపింది. అయితే వాటిని కూడా జత చేస్తూ సప్లమెంటరీ రిపోర్టును సోమవారం సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌కు హన్సారియా అందజేశారు. 2018 డిసెంబర్ నాటికి 4,122 మంది మాజీ, తాజా ఎంపీ, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, 2021 డిసెంబర్ నాటికి కేసుల సంఖ్య 4,974కి పెరిగిందని, 2022 నవంబర్ నాటికి 5,097 కేసులకు పెరిగిందని తెలిపారు.