Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ముజఫర్నగర్ అల్లర్ల కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీని దోషిగా పేర్కొంటూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును అలహాబాద్ హైకోర్టు సస్పెండ్ చేసింది. అల్లర్ల కేసులో విక్రమ్ సైనీకి దిగువ కోర్టు రెండేండ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది. ఖతౌలీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సైనీపై ఉత్తరప్రదేశ్ శాసనసభ నవంబర్ 13న అనర్హత వేటు వేసింది. ఈ స్థానానికి డిసెంబర్ 5న ఉప ఎన్నిక కూడా జరగనున్నది. ప్రస్తుతం ఈ కేసులో సైనీకి హైకోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. ప్రత్యేక కోర్టు తనకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ సైనీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇవ్వలేదని, కాబట్టి ఆయనపై అనర్హత వేటు కొనసాగుతుందని యూపీ శాసనసభ అధికార వర్గాలు పేర్కొన్నాయి.