Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజేఐను కలిసిన తెలంగాణ న్యాయవాదుల బృందం
న్యూఢిల్లీ : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డిని పట్నా హైకోర్టుకు బదిలీ చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్‌కు తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్ అసోసియేషన్ (టీహెచ్‌సీఏఏ) ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సోమవారం సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ సంజరు కిషన్ కౌల్, జస్టిస్ ఎంఆర్ షాలతో టీహెచ్‌సీఏఏ ప్రతినిధులు భేటీ అయ్యారు. సీజేఐకి వినతి పత్రం అందజేశారు. అయితే, న్యాయవాదులు విధులు బహిష్కరించిన అంశంపై ఆరా తీసిన సీజేఐ తిరిగి విధులు కొనసాగించాలని సూచించారు. బదిలీ సిఫారసులు కొలీజియం చేసిందని, ఈ అంశాన్ని తిరిగి పరిశీలన చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన పలు అంశాలపై సీజేఐ దృష్టికి వారు తీసుకెళ్లారు. సీజేఐ హామీతో న్యాయవాదులు తమ సమ్మె విరమిస్తున్నట్లు టీహెచ్‌సీఏఏ అధ్యక్షుడు రఘునాథ్, కార్యదర్శులు గడిపల్లి మల్లారెడ్డి, జల్లి నరేందర్ తెలియజేశారు.