Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్స్‌పై విచారణను డిసెంబర్ 6కి వాయిదా పడింది. రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికలు జరగనున్న సంవత్సరాలలో ఎలక్టోరల్ బాండ్ల విక్రయ కాల వ్యవధిని 15 రోజుల పాటు పొడిగిస్తూ ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ జయ ఠాకూర్ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోV్‌ా, జస్టిస్ జెబి పార్దివాలాలతో కూడిన ధర్మాసనం ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ గతంలో దాఖలైన పిటిషన్‌తో పాటు కేసును కూడా విచారించేందుకు అంగీకరించింది. ఈ పథకానికి సంబంధించిన సవాలు ఇప్పటికే జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ బివి నాగరత్నతో కూడిన ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉంది. ఆ పిటిషన్‌తో పాటు ఈ పిటిషన్‌ను జత చేస్తామని, ఆపైనే నోటీసు జారీ చేస్తామని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు.