Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను ఆపాలని విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహించారు. స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల జెఎసి ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు మంగళవారంనాటికి 600 రోజులకు చేరాయి. ఈ సందర్భంగా వందలాది మంది నల్ల వస్త్రాలు ధరించి, నల్ల జెండాలు చేబూని మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దీక్షా శిబిరం ఎదురుగా ఉన్న రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి, ప్రధాని మోడీ ఫ్లెక్సీని దహనం చేశారు.