Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : కేంద్ర కేబినెట్ సెక్రటేరియేట్ ఆధ్వర్యంలోని కేంద్ర, రాష్ట్రాల సమన్వయ కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర విభజన సమస్యలపై బుధవారం కీలకభేటీ జరుగనుంది. పెండింగ్‌లో ఉన్న అంశాల జాబితాను ఈ నెల మొదటి వారంలోనే అందించాలని కేంద్ర కేబినెట్ సెక్రటేరియేట్ రాష్ట్రాన్ని అదేశించింది. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన 34 పెండింగ్ అంశాలు ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించి అప్డేట్ చేయాలని అక్టోబరు 31న కూడా రాష్ట్ర సిఎస్‌కు కేంద్ర కేబినెట్ సెక్రటేరియేట్ డైరెక్టర్ లేఖ రాశారు.