Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురు మృతి
షిల్లాంగ్ : అసోం, మేఘాలయ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రాష్ట్రాల సరిహద్దులోని పశ్చిమ జైంతియా హిల్స్‌లోని ముఖోV్‌ా జిల్లాలో మంగళవారం చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో ఆరుగురు మరణించినట్టు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించామని అన్నారు. మృతుల్లో ఆరుగురు మేఘాలయకు చెందిన వారు కాగా, ఒకరు అసోంకు చెందిన అటవీ శాఖ అధికారి అని మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా స్పష్టం చేశారు. దీంతో ఏడు జిల్లాల్లో 48 గంటల పాటు ఇంటర్నెట్పై నిషేధం విధించినట్టు తెలిపారు. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి నెట్ సర్వీసులు నిలిపివేయనున్నట్టు మేఘాలయ ప్రభుత్వం పేర్కొంది. మంగళవారం ఉదయం అక్రమ కలప రవాణా చేస్తున్న ట్రక్కును అడ్డగించడంతో అసోం-మేఘాలయ సరిహద్దులో హింస చెలరేగింది. అసోం పరిధిలోని పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని ముక్రు ప్రాంతంలో అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో.. మేఘాలయలోని పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లా ముఖోV్‌ా వైపు అక్రమంగా కలప తరలిస్తున్న టింబర్‌ను అసోం అటవీ శాఖ బందం అడ్డుకుంది. ఈ క్రమంలో వాళ్లు పారిపోయే క్రమంలో పలువురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన తర్వాత ఫారెస్ట్ సిబ్బంది జిరికెండింగ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని భద్రతను పెంచారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న తర్వాత.. మేఘాలయ నుండి ఆయుధాలతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకుని, అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఫారెస్ట్ గార్డులు, పోలీసు సిబ్బందిపై దాడి చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అన్నారు.